NewsInn

News in a Click

విద్యుత్ షాక్‌తో ఇద్దరు విద్యార్థుల మృతి

విద్యుత్ షాక్‌తో ఇద్దరు విద్యార్థుల మృతి

పోలీసులకు భయపడి పరుగులు తీస్తుండగా విషాదం

(న్యూస్ఇన్,హైదరాబాద్)

కేజీ రెడ్డి కాలేజీ ఫెస్ట్‌ అనంతరం విషాద ఘటన చోటుచేసుకుంది. ఫెస్ట్‌ ముగిసిన తర్వాత కొందరు విద్యార్థులు సమీపంలోని పొలాల్లోకి వెళ్లి మద్యం సేవిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసుల పెట్రోలింగ్ వాహనాన్ని చూసి భయంతో పరుగులు తీసిన విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. రైతు రాజిరెడ్డి తన పొలానికి ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను గమనించక పోవడంతో అవి తగిలి మోహన్‌ అనే విద్యార్థితో పాటు మరో విద్యార్థి మృతి చెందినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *