ఇందిరమ్మ లబ్ధిదారులకు వారంలో కేటాయింపు
(న్యూస్ఇన్,హైదరాబాద్) ఇందిరమ్మ టవర్స్ లబ్దిదారుల ఎంపిక పూర్తి కావడంతో వారం రోజుల్లోనే కేటాయింపు పత్రాలను ఇచ్చేందుకు సర్కార్ రెడీ అవుతోంది. LIG గృహాల లక్కీ డ్రా ద్వారా మొత్తం 7,340 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని, వారిలో ఇప్పటివరకు 6,643 మంది అభ్యర్థుల క్షేత్రస్థాయి పరిశీలన పూర్తికాగా, 5,521 మంది అర్హులుగా నిర్ధారించామని హౌసింగ్ వీసీ, కమిషనర్ గౌతం తెలిపారు. మిగిలిన వారి ఎంపికపై క్షేత్రస్థాయి పరిశీలనను ఈ వారంలోనే పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులుగా…