హైదరాబాద్‌లో అమీత్ షా పాదయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో అమీత్ షా పాదయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన, బీజేపీ మహా పాదయాత్ర నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు నగరంలోని పలు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ముఖ్యంగా బషీర్‌బాగ్, లిబర్టీ, అబిడ్స్, ఎంజే మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నారు.

బీజేఆర్ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు పాదయాత్ర

amith shah

నిజాం కాలేజీ సమీపంలోని బాబూ జగ్జీవన్‌రామ్ (బీజేఆర్) విగ్రహం నుంచి మొజంజాహీ మార్కెట్ వరకు బీజేపీ మహా పాదయాత్ర నిర్వహించనుంది. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్నారు. పాదయాత్ర ముగిసిన అనంతరం ఎంజే మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించనున్నారు.

పాదయాత్రకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో నగరంలోని కీలక కూడళ్లలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు.

ఈ మార్గాల్లో వాహనాల మళ్లింపు

ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లించనున్నారు. జాంబాగ్, అఫ్జల్‌గంజ్ నుంచి జీపీఓ వైపు వెళ్లే వాహనాలను ఎంజే మార్కెట్ వద్ద తాజ్ ఐలాండ్ మార్గంలోకి మళ్లించే అవకాశం ఉంది.

లిబర్టీ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వాహనాలను అనుమతించకుండా హిమాయత్‌నగర్ వైపు మళ్లించనున్నారు. హిమాయత్‌నగర్ నుంచి వచ్చే వాహనాలను లిబర్టీ వద్ద పాత అంబేడ్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్ వైపు మళ్లించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

బషీర్‌బాగ్, అబిడ్స్‌లోనూ ఆంక్షలు

hyderabad traffic diversions

బషీర్‌బాగ్, కింగ్‌కోఠి, బోగ్గులకుంట, అబిడ్స్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండనున్నాయి. ఎంజే మార్కెట్ నుంచి జీపీఓ, నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు, అలాగే జీపీఓ నుంచి ఎంజే మార్కెట్ వైపు వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు.

లిబర్టీ, రవీంద్రభారతి, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం కూడళ్లతోపాటు ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్, జాంబాగ్ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది.

ఆర్టీసీ బస్సుల మార్గాల్లో మార్పులు

పాదయాత్ర నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను సైతం ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించే అవకాశం ఉంది. నాంపల్లి, అబిడ్స్, రామకోటి, కోఠి, చాదర్‌ఘాట్ ప్రాంతాల గుండా ప్రయాణించే వారు ముందుగానే ఇతర మార్గాలను ఎంచుకోవడం మంచిది.

రైల్వే, విమాన ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *