నిమజ్జనంలో అపశృతి-ఆరుగురు అనాధ విద్యార్థుల మృతి
(న్యూస్ఇన్, హైదరాబాద్) పఠాన్ చెరు సమీపంలో వినాయక నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటు చేసుకుంది. ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ సమీపంలో శిరీష అనాథాశ్రమం విద్యార్థులు వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు సమీపంలోని చెరువుకు వెళ్లారు. నిమజ్జనం చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఆనాధాశ్రమానికి చెందిన 6 గురు విద్యార్థులు చెరువులో గల్లంతయ్యారు. నీటిలో మునిగిపోతున్న వారిని కాపాడే ప్రయత్నం చేసుకుంటూ ఒకరి కొకరు పట్టుకోవడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన స్థానికులు…