కింగ్ నాగార్జునకు సీడ్ గణేష్
(న్యూస్ఇన్,హైదరాబాద్) ప్రముఖ నటుడు కింగ్ నాగార్జున కు ఆన్నపూర్ణ స్టూడియో లో గ్రీన్ గ్రీన్ ఛాలెంజ్ సభ్యులు సీడ్ గణేష్ ను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా భక్తిని పర్యావరణ పరిరక్షణతో మేళవించి సీడ్ గణేష్ ను పంపిణీ చేస్తున్నారు.విగ్రహాన్ని స్వీకరిస్తూ నాగార్జున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ దార్శనికతను హృదయపూర్వకంగా అభినందించారు. ఆరాధనను శాశ్వత పర్యావరణ మేలుగా మార్చే ఈ కృషిని ఆయన ప్రశంసించారు. సీడ్ గణేశను…