తెలంగాణా చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం- సీఎం రేవంత్ రెడ్డి
(న్యూస్ఇన్, హైదరాబాద్) తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేకమైన స్థానం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నిజాం రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు మారేందుకు ఈ రోజు ప్రత్యకమైందని పేర్కొన్నారు. ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. తెలంగాణ గడ్డ అన్యాయాన్ని ఎదిరించే పోరాటాలకు వేదికగా నిలిచిందన్నారు. సమ్మక్క–సారలమ్మల పోరాటం నుంచి రైతాంగ సాయుధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వరకు ప్రజా చైతన్యం కొనసాగిందని గుర్తుచేశారు. ప్రజా పాలన అంటే…