భూభారతి-22ఏపై బీజేపీ మహాధర్నా.. బీజేపీ నేతల తీవ్ర విమర్శలు
(న్యూస్ఇన్, హైదరాబాద్) తెలంగాణలో భూభారతి, 22ఏ నిషేధిత జాబితా అంశం రాజకీయ వేడిని పెంచుతోంది. రైతులు, మధ్యతరగతి ప్రజల భూములను 22ఏ జాబితాలో చేర్చడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భూభారతి-22ఏ మహాధర్నా నిర్వహించింది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు మాట్లాడుతూ.. భూభారతి, 22ఏ పేరుతో ప్రభుత్వం ప్రజలను, ముఖ్యంగా…