తెలంగాణాతాజా వార్త‌లు

డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ ఎడ్యుకేషన్ కోర్సు

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్)


డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లో హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్సులు అందుబాటులోకి రానున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో అంతర్జాతీయ విద్యాసంస్థలను రాష్ట్రానికి ఆకర్షిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో యూకే బిజినెస్ స్కూల్స్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ వివరాలను వెల్లడించారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ విద్యాసంస్థల ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లు, డ్యూయల్ డిగ్రీ కోర్సులు, అధ్యాపకుల శిక్షణ, పరిశోధనలకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఫ్యూచర్ సిటీలో ఎడ్యుకేషన్ హబ్‌ను అభివృద్ధి చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. యువతకు ఆధునిక నైపుణ్యాలు అందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్లడించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్య, నైపుణ్యాభివృద్ధిని అనుసంధానం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

డిసెంబర్‌లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’కు యూకే విద్యా రంగ ప్రతినిధులను సీఎం ఆహ్వానించారు. ఫ్యూచర్ సిటీలో విద్యాసంస్థలతో పాటు భారీ పెట్టుబడులను ఆకర్షించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *