పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్న భారత్ బుల్లెట్ రైలు.. గంటకు 280 కి.మీ. వేగం!

పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్న భారత్ బుల్లెట్ రైలు.. గంటకు 280 కి.మీ. వేగం!

బెంగళూరులో స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ..ముంబై–అహ్మదాబాద్ కారిడార్ కోసం 8 బోగీల రైలుఅత్యాధునిక సౌకర్యాలు, భద్రతకు పెద్దపీట (న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) భారత రైల్వే రంగంలో మరో సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమవుతోంది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న తొలి బుల్లెట్ రైలు తయారీ పనులు వేగంగా సాగుతున్నాయి. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం కర్ణాటక రాజధాని బెంగళూరులోని బీఈఎంఎల్ (BEML) కర్మాగారంలో ఈ రైలును నిర్మిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రయాణికుల భద్రత, సౌకర్యాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ రైలు…

Read Full News
హైదరాబాద్‌లో అమీత్ షా పాదయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో అమీత్ షా పాదయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు (న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన, బీజేపీ మహా పాదయాత్ర నేపథ్యంలో సోమవారం హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు నగరంలోని పలు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలగనుంది. ముఖ్యంగా బషీర్‌బాగ్, లిబర్టీ, అబిడ్స్, ఎంజే మార్కెట్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేఆర్…

Read Full News
20 కోట్ల ఓట్ల తొలగింపునకు కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

20 కోట్ల ఓట్ల తొలగింపునకు కుట్ర: సీఎం రేవంత్ రెడ్డి

పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళల ఓట్లు తొల‌గిస్తున్నార‌ని ఆరోపణ (న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే 13.50 కోట్ల ఓట్లు తొలగించారని, రాబోయే రోజుల్లో మరో 20 కోట్ల ఓట్లను తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలు, దళితులు, ఆదివాసీలు, మహిళల ఓటు హక్కును దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని…

Read Full News
కాంగ్రెస్ మూడేళ్ల పాలనపై గులాబీ పార్టీ సమరభేరి…!

కాంగ్రెస్ మూడేళ్ల పాలనపై గులాబీ పార్టీ సమరభేరి…!

ఉత్తర తెలంగాణపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి రైతు గర్జన పేరుతో వరుస బహిరంగ సభలు నవంబర్ 29న దీక్షా దివస్‌తో రాజకీయ వేడి పెంచే ప్రణాళిక (హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ రాజకీయ కార్యాచరణను ముమ్మరం చేస్తోంది. డిసెంబర్‌లో అధికార పార్టీ మూడేళ్ల పాలనను ఘనంగా జరుపుకొనేందుకు సిద్ధమవుతుండగా, అంతకంటే ముందే ప్రభుత్వ పనితీరును ప్రజాక్షేత్రంలో ప్రశ్నించేందుకు గులాబీ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ముఖ్యంగా సాగునీటి సమస్యలు,…

Read Full News
మియాపూర్ భూములు విక్రయిస్తాం…విద్యకు వెచ్చిస్తాం: సీఎం రేవంత్

మియాపూర్ భూములు విక్రయిస్తాం…విద్యకు వెచ్చిస్తాం: సీఎం రేవంత్

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) మియాపూర్‌లోని సుమారు 550 ఎకరాల భూమిపై తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ భూముల విలువ సుమారు రూ.50 వేల కోట్లుగా పేర్కొన్న ఆయన.. వాటిని విక్రయించడం ద్వారా వచ్చే నిధులను విద్య, వైద్యం, సాగునీటి రంగాల అభివృద్ధికి వినియోగిస్తామని ప్రకటించారు. ఢిల్లీలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భూముల విక్రయంపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు….

Read Full News
ఫార్ములా ఈ కార్ రేసు కేసు:కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్..డిసెంబ‌ర్ 4కు వాయిదా

ఫార్ములా ఈ కార్ రేసు కేసు:కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్..డిసెంబ‌ర్ 4కు వాయిదా

(హైదరాబాద్,న్యూస్ఇన్‌) ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి హాజరయ్యారు. స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు ఆలస్యంగా కోర్టుకు వచ్చారు. నాన్ బెయిలబుల్ వారెంట్…. విచారణ సమయంలో కోర్టుకు హాజరుకాకపోవడంతో కిరణ్ మల్లేశ్వరరావుపై న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. అయితే ఆయన ఆలస్యంగా విచారణకు హాజరయ్యారు. ఈ…

Read Full News
కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై సునీల్ టీం సర్వే… రేవంత్ వ్యాఖ్యలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్

కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై సునీల్ టీం సర్వే… రేవంత్ వ్యాఖ్యలు, ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్

(న్యూస్ఇన్, హైద‌రాబాద్) తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో పార్టీ నాయకత్వం క్షేత్రస్థాయి పరిస్థితులపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై చేస్తున్న వ్యాఖ్యలు, ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి.. ఇలా పలు అంశాలపై ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు సునీల్ కనుగోలు బృందానికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ముఖ్యంగా సీఎం వ్యాఖ్యలపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? ఎమ్మెల్యేల పనితీరు పట్ల నియోజకవర్గాల్లో సంతృప్తి ఉందా? అనే అంశాలను ఈ…

Read Full News
తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యం సాధ్యమే: పీయూష్ గోయల్

తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యం సాధ్యమే: పీయూష్ గోయల్

(న్యూస్ఇన్, న్యూఢిల్లీ) తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సమష్టి కృషితో సాధించవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఫార్మా, ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో తెలంగాణకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన…

Read Full News
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కండి.. నాది భరోసా: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కండి.. నాది భరోసా: సీఎం రేవంత్‌రెడ్డి

(న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని, ప్రతి పెట్టుబడికి తాను భరోసాగా నిలుస్తానని హామీ ఇచ్చారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026 సన్నాహక కార్యక్రమాన్ని గురువారం…

Read Full News
బీఆర్ఎస్‌లో అభ్యర్థుల వేట …పార్టీ ముమ్మ‌ర‌  క‌స‌ర‌త్తు..!

బీఆర్ఎస్‌లో అభ్యర్థుల వేట …పార్టీ ముమ్మ‌ర‌ క‌స‌ర‌త్తు..!

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) బీఆర్ ఎస్ ప‌ట్ట‌భ‌ద్రుల మండ‌లి అభ్య‌ర్థుల కోసం వేట మొద‌లు పెట్టింది. అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌డంపై ముమ్మ‌రంగా క‌స‌ర‌త్తు చేస్తోంది. రాష్ట్రంలో మ‌రోసారి ఎన్నిక‌ల వాతావ‌ర‌ణ క్ర‌మంగా వేడెక్కుతోంది. రెండు ప‌ట్ట‌భ‌ద్రుల‌ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఖైరతాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. బీఆర్ఎస్‌లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు కొనసాగుతోంది. ముఖ్యంగా మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాన్ని మరోసారి దక్కించుకోవడంతో పాటు ఖైరతాబాద్‌లో…

Read Full News