పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్న భారత్ బుల్లెట్ రైలు.. గంటకు 280 కి.మీ. వేగం!

పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్న భారత్ బుల్లెట్ రైలు.. గంటకు 280 కి.మీ. వేగం!

బెంగళూరులో స్వదేశీ పరిజ్ఞానంతో తయారీ..ముంబై–అహ్మదాబాద్ కారిడార్ కోసం 8 బోగీల రైలుఅత్యాధునిక సౌకర్యాలు, భద్రతకు పెద్దపీట (న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) భారత రైల్వే రంగంలో మరో సరికొత్త అధ్యాయానికి రంగం సిద్ధమవుతోంది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందిస్తున్న తొలి బుల్లెట్ రైలు తయారీ పనులు వేగంగా సాగుతున్నాయి. ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం కర్ణాటక రాజధాని బెంగళూరులోని బీఈఎంఎల్ (BEML) కర్మాగారంలో ఈ రైలును నిర్మిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రయాణికుల భద్రత, సౌకర్యాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ రైలు…

Read Full News
ఎకరానికి రూ.60 వేలు వెంటనే చెల్లించాలి: కేటీఆర్

ఎకరానికి రూ.60 వేలు వెంటనే చెల్లించాలి: కేటీఆర్

మూడు విడతల రైతుబంధు బకాయి – యాసంగి పెట్టుబడి సాయం ఇవ్వాలని డిమాండ్.. ఆదిలాబాద్ రైతు గర్జనలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ (ఆదిలాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణ రైతులకు పెండింగ్‌లో ఉన్న మూడు విడతల రైతుబంధు బకాయిలతోపాటు ప్రస్తుత యాసంగి పంట పెట్టుబడి సాయాన్ని కలిపి ఎకరానికి రూ.60 వేల చొప్పున వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో నెలకొన్న…

Read Full News
హైదరాబాద్‌లో 36 గంట‌లు  నీటి సరఫరా బంద్.. ప్రభావిత ప్రాంతాలివే!

హైదరాబాద్‌లో 36 గంట‌లు నీటి సరఫరా బంద్.. ప్రభావిత ప్రాంతాలివే!

నవంబర్ 3 ఉదయం నుంచి 4 సాయంత్రం వరకు అంతరాయం గండిపేట కాండ్యూట్‌లో లీకేజీల మరమ్మతులకు జలమండలి చర్యలు (న్యూస్ఇన్,హైద‌రాబాద్) నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. గండిపేట కాండ్యూట్‌లో ఏర్పడిన భారీ లీకేజీలను అరికట్టేందుకు జలమండలి మరమ్మతు పనులు చేపట్టనుంది. దీంతో నవంబర్ 3వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు…

Read Full News
హైదరాబాద్‌లో గర్ల్స్ హాస్టల్ ముసుగులో అక్రమ దందా.. అండాల విక్రయాలపై పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్‌లో గర్ల్స్ హాస్టల్ ముసుగులో అక్రమ దందా.. అండాల విక్రయాలపై పోలీసుల దర్యాప్తు

యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారనే ఆరోపణలు అండాలను సేకరించి ఫెర్టిలిటీ సెంటర్లకు విక్రయిస్తున్నట్లు అనుమానాలు (న్యూస్ఇన్,హైదరాబాద్) గర్ల్స్ హాస్టల్ ముసుగులో వ్యభిచారంతో పాటు యువతుల అండాల అక్రమ సేకరణ, విక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు హైదరాబాద్‌లో కలకలం రేపుతున్నాయి. బేగంపేట పరిధిలోని ప్రకాశ్‌నగర్‌లో ఉన్న ఓ గర్ల్స్ హాస్టల్‌లో అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయించడంతో పాటు వారి అండాలను సేకరించి సంతాన సాఫల్య కేంద్రాలకు…

Read Full News
గురుకులంలో విద్యార్థి మృతి… ప్రిన్సిపాల్, హౌస్‌మాస్టర్ సస్పెండ్

గురుకులంలో విద్యార్థి మృతి… ప్రిన్సిపాల్, హౌస్‌మాస్టర్ సస్పెండ్

(హైదరాబాద్‌,న్యూస్ఇన్‌) విద్యార్థుల భద్రత, పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించడంతో పాటు, విద్యార్థి మృతి ఘటనను సకాలంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకపోవడంపై తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (TGSWREIS) ఇద్దరు సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. వరంగల్‌ జిల్లా పార్కల్‌–ఓగ్లాపూర్‌ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌, హౌస్‌మాస్టర్‌పై ఈ చర్యలు తీసుకుంది. విద్యార్థుల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని సొసైటీ కార్యదర్శి రవి గుగులోతు స్పష్టం చేశారు. కార్తిక్‌ మృతి ఘటనపై విచారణ… పార్కల్‌ గురుకులంలో బీపీసీ…

Read Full News
తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యం సాధ్యమే: పీయూష్ గోయల్

తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యం సాధ్యమే: పీయూష్ గోయల్

(న్యూస్ఇన్, న్యూఢిల్లీ) తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని సమష్టి కృషితో సాధించవచ్చని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. ఫార్మా, ఏరోస్పేస్, రక్షణ, ఎలక్ట్రానిక్స్, కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్ వంటి రంగాల్లో తెలంగాణకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో ఆయన…

Read Full News
KCR నివాసంలో ఘనంగా దసరా

KCR నివాసంలో ఘనంగా దసరా

మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర రావు గారి ఎర్రవెల్లి నివాసంలో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. వేద పండితుల సమక్షంలో కెసిఆర్ గారు సాంప్రదాయ పద్ధతిలో వాహన పూజ ఆయుధపూజ నిర్వహించారు.. ఈ వాహన పూజా కార్యక్రమంలో కేటీఆర్, హిమాన్షు రావు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు ఇతర పార్టీ నేతలు పాల్గొనగా శమీవృక్షానికి పూజ నిర్వహించిన కేసీఆర్ గారు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి దసరా శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఎర్రవెల్లిలో నిర్వహించిన దసరా…

Read Full News
తెలంగాణాలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.. కేసీఆరే సీఎం: కేటీఆర్‌

తెలంగాణాలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే.. కేసీఆరే సీఎం: కేటీఆర్‌

(న్యూస్ఇన్‌,న్యూఢిల్లీ) తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్ ప్ర‌భుత్వ‌మే అధికారంలోకి వస్తుందని, పార్టీ అధినేత కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్‌-2026లో పాల్గొన్న ఆయన.. బీజేపీతో పొత్తు, డీలిమిటేషన్‌, ఎస్‌ఐఆర్‌, కాంగ్రెస్‌ పాలన, యువత సమస్యలపై తన అభిప్రాయాలను స్ప‌ష్టం చేశారు. బీజేపీతో పొత్తు ఉండదు…. రాబోయే ఎన్నిక‌ల్లో బీజేపీతో బీఆర్‌ఎస్‌కు పొత్తు ఉండదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. గత 26 ఏళ్లలో బీజేపీతో తమ…

Read Full News
సిరిసిల్లలో కేటీఆర్ పై సీఎం రేవంత్ ఘాటు విమర్శలు…!

సిరిసిల్లలో కేటీఆర్ పై సీఎం రేవంత్ ఘాటు విమర్శలు…!

(న్యూస్ఇన్‌, సిరిసిల్ల‌) సిరిసిల్ల‌లో జరిగిన స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ పై ఘాటైన‌ విమ‌ర్శ‌లు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలని, నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇచ్చేలా చూస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో సిరిసిల్లలో చేనేత కార్మికులు, వలస కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేద‌న్నారు. కేటీఆర్‌పై సీఎం విమర్శలు… సిరిసిల్ల చేనేతకు ప్రసిద్ధి చెందిన ప్రాంతమని, అయితే గత బీఆర్‌ఎస్‌ పాలనలో తీసుకున్న నిర్ణయాల‌తో…

Read Full News
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తాం: కేటీఆర్

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ గెలుస్తాం: కేటీఆర్

(న్యూస్ఇన్.హైద‌రాబాద్) హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మరోసారి విజయం సాధిస్తుందని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో హైదరాబాద్‌, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి….. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు నమోదు కీలకమని కేటీఆర్‌ అన్నారు. అర్హత ఉన్న ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా…

Read Full News