NewsInn

News in a Click

ఫార్ములా ఈ కార్ రేసు కేసు:కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్..డిసెంబ‌ర్ 4కు వాయిదా

ఫార్ములా ఈ కార్ రేసు కేసు:కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్..డిసెంబ‌ర్ 4కు వాయిదా

(హైదరాబాద్,న్యూస్ఇన్‌)

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణకు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డి హాజరయ్యారు. స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు ఆలస్యంగా కోర్టుకు వచ్చారు.

నాన్ బెయిలబుల్ వారెంట్….

విచారణ సమయంలో కోర్టుకు హాజరుకాకపోవడంతో కిరణ్ మల్లేశ్వరరావుపై న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. అయితే ఆయన ఆలస్యంగా విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాది వారెంట్‌ను రీకాల్ చేయాలని కోర్టును కోరనున్నట్లు తెలిసింది.

కేటీఆర్ అబ్సెంట్ పిటిషన్…..

మరోవైపు, ఇతర కారణాలతో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరుకాలేదు. ఆయన తరఫున కోర్టులో అబ్సెంట్ పిటిషన్ దాఖలైంది.

ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌పై కూడా విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏసీబీ అధికారులు న్యాయస్థానాన్ని మరింత సమయం కోరారు. ఏసీబీ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *