దేశం నలుమూలల నుంచి మేడారంకు భక్తులు
కిక్కిరిసిన సమ్మక్క, సారాలమ్మ గద్దెలు (మేడారం,న్యూస్ఇన్) ములుగు జిల్లాలోని మేడారం భక్తజన సంద్రంగా మారింది.లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో వనదేవతల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మహారాష్ట్ర,ఏపీ, చత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి ఆదివాసి గిరిజనులు,భక్తులు మేడారానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాబోయే రెండు రోజులు భారీ సంఖ్యలో భక్తులు మేడారంకు తరలివస్తారని అంచనా . మేడారం వెళ్లే దారి పొడవునా గిరిజన మహిళల నృత్యాలు,దొరల కొమ్ము బూరల శబ్దాలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. ఇక్కడి వాతావరణం…