ఈసారి ఇంటర్ పరీక్షలు రాయనున్న 9.8 లక్షల విద్యార్థులు.. టైం టేబుల్ ఇదే
హైదరాబాద్, డిసెంబర్ 4 తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి నెలలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇంటర్ బోర్డు ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9.8లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మంగళవారం వరకు 9,79,506 మంది విద్యార్థులు ఫీజు చెల్లించినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. వార్షిక పరీక్షలు 2026 ఫిబ్రవరి…