జాతీయంతాజా వార్త‌లుతెలంగాణా

డ్రగ్స్ కట్టడిలో తెలంగాణకు జాతీయ గుర్తింపు… ఈగల్ ఫోర్స్‌కు పురస్కారం

(న్యూస్ఇన్,హైద‌రాబాద్)

మాదకద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్‌ శాఖకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ చేపట్టిన దర్యాప్తు, ఇంటెలిజెన్స్‌, నిరోధక చర్యలు, సమన్వయానికి కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు అందించింది. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ స్థాయి యాంటీ నార్కోటిక్స్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ANTF) అధిపతుల సమావేశంలో ఈగల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.

ఏడు అంశాల్లో 80 శాతానికి పైగా మార్కులు

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఏడు ప్రధాన ప్రమాణాల ఆధారంగా రాష్ట్రాల యాంటీ నార్కోటిక్స్‌ టాస్క్‌ ఫోర్స్‌ పనితీరును అంచనా వేశారు. ఇంటెలిజెన్స్‌ ఆపరేషన్స్‌, సింథటిక్‌ డ్రగ్స్‌ నియంత్రణ, ప్రాసిక్యూషన్‌, డిమాండ్‌–హార్మ్‌ రిడక్షన్‌, సమన్వయం–కెపాసిటీ బిల్డింగ్‌, రిసెర్చ్‌–అనాలిసిస్‌, అడ్మినిస్ట్రేషన్‌–లాజిస్టిక్స్‌ అంశాల్లో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌ 80 శాతానికి పైగా మార్కులు సాధించింది.

ప్రాసిక్యూషన్‌పై ప్రత్యేక దృష్టి

డ్రగ్స్‌ కేసుల్లో ప్రాసిక్యూషన్‌ను బలోపేతం చేసేందుకు తెలంగాణలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. లీగల్‌ సెర్చ్‌, జ్యుడీషియల్‌ అనాలిసిస్‌, సాక్షుల రక్షణ, ప్రాసిక్యూషన్‌ సపోర్ట్‌ కోసం ప్రత్యేక సెల్‌లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

భవిష్యత్‌ తరాల రక్షణే లక్ష్యం

డ్రగ్స్‌ మహమ్మారి నుంచి భవిష్యత్‌ తరాలను కాపాడటమే లక్ష్యమని డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఈగల్‌ ఫోర్స్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్యతో పాటు సిబ్బందిని ఆయన అభినందించారు. జిల్లాల వారీగా ఇంటెలిజెన్స్‌, దర్యాప్తు, ప్రాసిక్యూషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు.

సైబర్‌ నేరాల నియంత్రణ, యాంటీ నార్కోటిక్స్‌ చర్యల్లో తెలంగాణ పోలీస్‌ శాఖ అత్యుత్తమ పనితీరు సాధించిందని అధికారులు తెలిపారు. ఇతర విభాగాల్లోనూ పనితీరు మెరుగుపర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు డీజీపీ వెల్లడించా

Fallow us on….https://whatsapp.com/channel/0029Vb7fQokJENxuemz6EL3X

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *