స‌మంత పెళ్లితో సంభూత శుద్ది హాట్ టాపిక్

( హైద‌రాబాద్, న్యూస్ఇన్) ప్ర‌ముఖ క‌థానాయిక స‌మంత కొత్త జీవితాన్ని ఆరంభించింది. ఫ్యామిలీ మెన్ డైరెక్ట‌ర్ రాజ్ నిడిమోరుతో క‌లిసి కొత్త వివాహ‌బంధంలో అడుగు పెట్టింది. సోమ‌వారం ఈషా ఫౌండేష‌న్ లో ఉన్న లింగభైర‌వి ఆలయంలో వీరి పెళ్లి జ‌రిగింది. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. వీరి పెళ్లి విష‌యం కూడా ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారి తీస్తోంది. వీరి పెళ్లిపై ఈషా ఫౌండేష‌న్ విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో సంభూత శుద్ధి…

Read Full News

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలకు భారీగా న‌మోదు

ముగిసిన న‌మోదు ప్ర‌క్రియ‌ డిప్ ద్వారా మంగ‌ళ‌వారా కేటాయింపు (అమ‌రావ‌తి, న్యూస్ఇన్) వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్బంగా తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పెద్ద ఎత్తున ఆన్ లైన్ లో న‌మోదు చేసుకున్నారు. టీటీడి 1.8. ల‌క్ష‌ల టోకెన్ల‌ను ఆన్ లైన్ల్లో కేటాయించేందుకు ఏర్పాట్లు చేయ‌గా దాదాపు 25 ల‌క్ష‌ల మంది త‌మ పేర్లు న‌మోదు చేసుకున్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి ఒక‌టో తేదీ సాయంత్రం వ‌ర‌కు భ‌క్తుల న‌మెదుకు టీటీడి అనుమ‌తి ఇచ్చింది.డిసెంబర్ 30న…

Read Full News

ఏపీకి చేరుకున్న అనుమానాస్పద పడవ

(అమరావతి,న్యూస్ఇన్) ఎచ్చెర్ల మండలం వద్దకు అనుమానాస్పద పడవ ఒడ్డుకు కొట్టుకువచ్చినట్లు స్థానిక మత్స్యకారులు గుర్తించారు. సముద్రంలో పడవ చెడిపోయిన తర్వాత 20 రోజులుగా కొట్టుకుపోతున్న 13 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులు ఈ పడవలో ఉన్నారు. ఈ సమాచారం స్థానిక మత్స్యకారులు మెరైన్ పోలీసులకు అందించారు. పోలీసులు పడవలోని 13 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అలసిపోయిన వారికి స్థానికులు ఆహారం అందించారు. పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

Read Full News

మత్స్యకారులు వేటకు వద్దు

(అమరావతి, న్యూస్ఇన్) నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా కొనసాగుతున్న దిత్వా తుఫాన్ కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదులుతున్న తీవ్రవాయుగుండం. మధ్యాహ్నానంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని ప్రకటించింది.ఈ ప్రభావంతోనెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలకు అవకాశం ఉంది.కోస్తాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.దక్షిణకోస్తా తీరం వెంబడి 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం…

Read Full News

శ్రీవారి ద‌ర్శ‌నానికి రికార్డు స్థాయిలో భ‌క్తుల న‌మోదు

వైకుంఠ ద్వార దర్శనం – E-DIP 70 ల‌క్ష‌ల మంది న‌మోదు చేసుకునే అవ‌కాశం (అమ‌రావ‌తి, న్యూస్ఇన్) తిరుమ‌ల వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం కోసం పెద్ద ఎత్తున భ‌క్తులు eDIP ఇప్పటివరకు 6 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. దాదాపు 15 లక్షల మంది డిప్ ద్వారా ద‌ర్శ‌నం కోసం న‌మోదు చేసుకున్నారు. సోమ‌వారం సాయంత్రం వ‌ర‌కు ఇంకా న‌మోదు చేసుకునే అవ‌కాశం ఉండ‌డంతోఈ ఐదు రోజుల వ్యవధిలో 60–70 లక్షల రిజిస్ట్రేషన్లు వచ్చే అవకాశం ఉందని…

Read Full News

కార్తీక దిపోత్స‌వం – ప్రత్యేక రైళ్లు

తిరువాణ‌మ‌లై భ‌క్తులకు అందుబాటులో (హైద‌రాబాద్, న్యూస్ఇన్) తిరువణ్ణామలై కార్తీక దీపం సందర్భంగా ఈ నెల 3, 4 తేదీల్లో దక్షిణ రైల్వే 15 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. నవంబర్ 24న ప్రారంభమైంది. కార్తీక‌దిపోత్స‌వం సంద‌ర్భంగా దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు ప‌ది రోజుల‌పాటు ప్ర‌త్యేకంగా పూజ‌లు నిర్వ‌హిస్తారు.దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భ‌క్తులు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌స్తారు.మహా దీపం వెలిగించే రోజున ల‌క్ష‌లాది మంది భ‌క్తులు తిరువాణ్ణ‌మ‌లై చేరుకుంటారు. ఈ ఏడాది దాదాపు 40 లక్షలకు పైగా…

Read Full News

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (అమరావతి, న్యూస్ ఇన్) నైరుతి బంగాళాఖాతం దిత్వా తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాతీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురుగాలులు నెల్లూరు, తిరుపతి జిల్లాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలి.అత్యవసర సహాయక చర్యల కోసం నెల్లూరు, కడపలో 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వెంకటగిరిలో 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు అదనంగా మరో 3 బృందాలు సిద్ధం…

Read Full News

అమరావతిలో బ్యాంకులు భీమా కంపెనీలు

(అమరావతి,న్యూస్ ఇన్) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రభుత్వం 15 జాతీయ బ్యాంకులు,.భీమా కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ వ్యవహార తీరుతో ఆగిపోయిన అమరావతి అభివృద్ధి పనులు ప్రధాని మోడీ మళ్ళీ ప్రారంభించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతిలో బ్యాంకులో నిర్మాణం కోసం కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తో కలిసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.రూ.15 వేల కోట్లను రాజధాని పునర్నిర్మాణానికి కేటాయించారని రూ.1,334 కోట్లతో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలు…

Read Full News

మావోయిస్టుల సంచలన లేఖ

జనవరి 1న లొంగిపోతాం (హైదరాబాద్, న్యూస్ ఇన్) మావోయిస్టులను వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిగా ఏరి వేస్తామని కేంద్రం చేసిన ప్రకటన…. ఆ తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ దిశగా అడుగులు పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. కీలక నేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందగా…. మరి కొంతమంది నేతలు జనజీవన స్రవంతిలో కలిసేందుకు రెడీ అవుతున్నారు.కొద్దిరోజుల క్రితం ఆయుధం వీడెందుకు తమకు గడువు ఇవ్వాలని లేఖలో కోరిన మావోయిస్టులు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో జనవరి ఒకటో…

Read Full News

నలుదిక్కులా తిరుమల శ్రీవారి వైభవం

ఆధ్యాత్మిక చిరునామాగా టీటీడీ శ్రీవారి సేవకులుగా వైద్య నిపుణులకు అవకాశం వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు ప్రధాన దేవాలయాల్లో తిరుమల తరహా విధానాలు టిటిడి పై సమీక్షలో ముఖ్యమంత్రి (అమరావతి, న్యూస్ ఇన్)ప్రపంచం నలు దిక్కులా తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక వైభవాన్ని చాటేలా కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీని ఆదేశించారు. ఆధ్యాత్మికం, అన్నదానం, విద్య, వైద్యానికి చిరునామాగా తిరుమల తిరుపతి దేవస్థానం మారాలని సూచించారు. గురువారం సచివాలయంలో దేవాదాయశాఖ, తిరుమల తిరుపతి దేవస్థానంపై ముఖ్యమంత్రి సమీక్ష…

Read Full News