Headlines

జనాభా భారం కాదు… ఇక భాగ్యం కావాలి

పాపులేషన్ మేనేజ్మెంట్ ముసాయిదా పై సీఎం చంద్రబాబు (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) మారుతున్న కాలానికి అనుగుణంగా జనాభా పెరుగుదల భారం కాదని, రాష్ట్రానికి భాగ్యం అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఫ్యామిలీ ప్లానింగ్‌కి ప్రాధాన్యత ఇచ్చామని, ఇకపై ‘పాపులేషన్ కేర్’ పై దృష్టి పెట్టనున్నట్టు తెలిపారు. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ తీసుకువస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్ర‌క‌టించారు. జనాభా నిర్వహణ పై డ్రాఫ్ట్ పాలసీపై శాసనసభలో గురువారం ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఏపీలో ప్రస్తుతం టోటల్…

Read Full News

సికింద్రాబాద్-కాజీపేట మ‌ధ్య ప‌లు రైళ్ల ర‌ద్దు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) ద‌క్షిణ మ‌ధ్య రైల్వే సికింద్రాబాద్-కాజీపేట రైల్వే సెక్ష‌న్ల మ‌ధ్య ప‌లు రైళ్ల‌ను పాక్షికంగా ర‌ద్దు చేసింది. ప‌లు రైళ్ల‌ను దారి మ‌ళ్లిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. బీబీ న‌గ‌ర్ – ప‌గిడి ప‌ల్లి మ‌ధ్య‌లో రైల్వే ట్రాక్ మ‌ర‌మ్మ‌త్తు ప‌నులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకును్న‌ట్లు సీపీఆర్ఓ శ్రీధ‌ర్ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రైళ్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి…..

Read Full News

తిరుమల ఆలయం చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయం

టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు భక్తి లేదు టిడిపి హయాంలోనే కల్తీ నెయ్యికి బీజం పడింది వైయస్ జగన్ తీవ్ర ఆరోపణలు (అమరావతి, న్యూస్ఇన్) ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొన్ని రోజులుగా తిరుమల ఆలయం చుట్టూ తిరుగుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లే తిరుమల పవిత్రత పై భక్తులకు అనుమానాలు మొదలయ్యాయని అధికార టిడిపి వైసిపిని టార్గెట్ చేస్తుంది. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లడ్డూ తయారీలో వైసీపీ సర్కార్ అనుసరించిన విధానం తిరుమల లడ్డు…

Read Full News

ఢిల్లీ లిక్క‌ర్ కేసు కొట్టి వేసిన కోర్టు

క‌విత‌కు భారీ ఊర‌ట‌ (న్యూఢిల్లీ,న్యూస్ఇన్‌) దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఢిల్లీ లిక్క‌ర్ కేసును కోర్టు కొట్టి వేసింది. కేసు విచారిస్తున్న సిబీఐ కోర్టు ఈ కేసులో అధికారులు స్కాం జ‌రిగింద‌నేందుకు ఖ‌చ్చిత‌మైన ఆధారాలు చూప‌లేక‌పోయింద‌ని కోర్టు అభిప్రాయ ప‌డింది. ఈ కేస‌లో 23 మంది నిందితులు త‌ప్పు చేశారనేందుకు ఎలాంటి సాక్ష్యా ధారాలు లేవ‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ కేసులో ఆరు నెల‌ల‌కు పైగా తెలంగాణా జాగృతి అధ్య‌క్షు రాలు క‌ల్వ‌కుంట్ల క‌విత జైల్లో…

Read Full News

పున‌ర్విక‌కు ఆరు కోట్ల ఆర్దిక స‌హాయం

మంత్రి నారా లోకేష్ (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) మంత్రి నారా లోకేష్ గత కొన్ని రోజులుగా చిన్నారి పునర్విక ఆరోగ్యం కోసం సోషల్ మీడియాలో లక్షలాది మంది ఒక మానవతా సైన్యంగా ఏర్పడి నిధులు సమకూరుస్తున్నారు. పోస్టుల ద్వారా పునర్విక కుటుంబానికి నైతిక మద్దతు తెలుపుతున్నారు. SMA టైప్-1 అనే జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న కర్నూలుకు చెందిన పునర్విక వ్యాధితో పోరాడుతోంది. చిన్నారిని రక్షించుకునేందుకు ఉన్న ఏకైక మార్గం ₹16 కోట్లు ఇంజక్షన్. అని వైద్యులు సూచించ‌డంతో ఆ నిధుల…

Read Full News

ద‌క్షిణ మ‌ధ్య రైల్వే’లాజిస్టిక్’ యాప్ ఆవిష్క‌ర‌ణ‌

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) దక్షిణ మధ్య రైల్వే రైల్ పార్శిల్ లాజిస్టిక్ సేవ‌ల‌తో ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ‌య్యేందుకు రెడీ అయింది.రైళ్ల ద్వారా పార్శిల్ ర‌వాణా చేసేందుకు ఎంచుకునే వినియోగదార్లకు ఇంటింటికీ సజావుగా పార్శిల్ బుకింగ్ మరియు డెలివరీ సేవలను అందించే సమగ్ర డిజిటల్ ఈ-మార్కెట్‌ప్లేస్ అయిన తదుపరి తరం ‘రైల్ పార్శిల్ యాప్’అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ను ఆవిష్క‌రించిన అనంత‌రం దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజర్ శ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఆధునిక యుగంలో, పార్శిల్ బుకింగ్…

Read Full News

న‌కిలీ వెబ్ సైట్ ల‌పై టీటీడీ హెచ్చ‌రిక‌

(తిరుమల,న్యూస్ఇన్‌) తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామి పేరుతో వెబ్ సైట్లు ఏర్పాటు చేసి కొంత మంది ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నార‌ని భ‌క్తులు ఈ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని టీటీడీ హెచ్చ‌రించింది. కర్ణాటక ప్రవాసీ సౌధ పేరుతో గదులను ఏర్పాటు చేస్తానని చెప్పి ఒక వ్యక్తి తనను మోసం చేశాడని కేరళకు చెందిన సి.కె. సురేష్ బాబు అనే భక్తుడు టీటీడీకి ఫిర్యాదు చేశారు. వ‌స‌తి, సౌక‌ర్యం పేరు చెప్పి డ‌బ్బులు వ‌సూలుచేసి మోసం చేశార‌ని ఫిర్యాదు చేశారు. భక్తులను…

Read Full News

తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

రోజుకు 60 వేల మంది భక్తుల ప్రయాణం (తిరుమ‌ల‌,న్యూస్ఇన్) తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మ రథాలు (ఉచిత బస్సు సేవలు) డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని భక్తులు ముందుగానే తెలుసుకునేలా డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల వేచిచూసే సమయం తగ్గి, ఉచిత రవాణా సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు.ప్రస్తుతం తిరుమలలో మొత్తం 12 ఆధునిక ఎలక్ట్రిక్ బస్సులు ఈ సేవలో ఉన్నాయి. రోజుకు…

Read Full News

ప్రభుత్వ కళాశాలల్లో ఖాళీలను భర్తీ చేస్తాం

ప్రైవేటు కాలేజీలకు ధీటుగా కాలేజీలను తీర్చిదిద్దుతాం మండ‌లి లో మంత్రి నారా లోకేష్ (అమరావతి,న్యూస్ఇన్‌)ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల మంజూరుపై శాసనమండలిలో సభ్యుడు ఏ.శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మంజూరు చేయడం జరిగింది. మొత్తం 9 ప్రభుత్వ జూనియర్…

Read Full News

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ వ‌ర్షాలు

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌)) వాతావ‌ర‌ణ శాఖ అంచచ‌నాలు నిజం అయ్యాయి. 22 వ తేదీ నుంచి 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ వారం రోజుల క్రితమే హెచ్చ‌రించింది. ఆదివారం ఏపీలోని అన‌కాప‌ల్లి స‌హా ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురిసాయి. ఆర్ధ‌రాత్రి దాటిన త‌రువాత ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వ‌ర్షం కురిసింది. ఒక్క సారిగా వాతావ‌ర‌ణంలో మార్పులు చోటు చేస‌కుని వ‌ర్షం కురిసింది.బంగాళా ఖాతంలో ఏర్ప‌డిన…

Read Full News