ప్రజాప్రతినిధుల పనితీరును విశ్లేషిస్తున్నా
పార్టీని బలోపేతం చేసిన వారిని నేను బలోపేతం చేస్తా కుప్పంలో సీఎం చంద్రబాబు (అమరావతి,న్యూస్ఇన్) ప్రజల కోసం… పార్టీ బలోపేతం కోసం పనిచేసే వారికి ఎవ్వరి రికమెండేషన్లు అక్కర్లేదని… పదవులు వెతుక్కుంటూ వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డికి అలాగే పదవి దక్కిందని సీఎం వెల్లడించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో నేతల పనితీరు మీద కూలంకుషంగా సమీక్షించారు. మంత్రి…