శ్రీ‌వాణి ఆఫ్ లైన్ టికెట్ల‌ జారీ ర‌ద్దు

(అమ‌రావ‌తి,న్యూస్ ఇన్‌) తిరుమ‌ల‌లో నెల‌కొన్న భారీ ర‌ద్దీ కార‌ణంగా డిసెంబ‌ర్ 27, 28, 29వ‌ తేదిల‌కు (శ‌ని, ఆది, సోమ‌వారం) సంబంధించి శ్రీ‌వాణి ఆఫ్ లైన్ (Offline) టికెట్ల జారీని టీటీడీ ర‌ద్దు చేసింది. 10 వేల రుపాయ‌ల తో శ్రీవారి ద‌ర్శ‌నానికి టీటీడి శ్రీవాణి పేరుతో ద‌ర్శ‌నాలు క‌ల్పించాల‌నే నిర్ణ‌యాన్ని అమ‌లు చేస్తోంది. భ‌క్తుల ర‌ద్దీ, వైకుంఠ ఏకాద‌శి త‌దిత‌ర కార‌ణాల‌తోతిరుమ‌ల శ్రీ‌వాణి ద‌ర్శ‌న టికెట్ల కౌంట‌ర్ లో, తిరుప‌తిలోని రేణిగుంట విమానాశ్ర‌యంలో శ్రీ‌వాణి ఆఫ్…

Read Full News

హైదరాబాద్ – శ్రీశైలం రహదారిపై పెద్దపులి

(హైద‌రాబాద్,న్యూస్ఇన్) న‌ల్ల‌మ‌ల్ల అట‌వీ ప్రాంతంలో పెద్ద‌పులి క‌నిపించింది.నాగర్ కర్నూల్ జిల్లా మన్ననూర్ రేంజ్లో పెద్దపులి సంచారం వాహనదారులను కలవర పెట్టింది. ఫరహాబాద్ చౌరస్తా సమీపంలో హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారిపై పులి దర్జాగా నడుచుకుంటూ వెళ్తుండగా నిన్న రాత్రి కొందరు గమనించారు. హెడ్లైట్ల వెలుగులో రోడ్డుపై సంచరిస్తున్న పులిని చూసి జడుసుకున్నారు. యాత్రికులు ఆ దృశ్యాలను తమ మొబైల్స్ లో బంధించారు.

Read Full News
తిరుమ‌లపై అసత్య ప్రచారాలు నమ్మవద్దు

తిరుమ‌లపై అసత్య ప్రచారాలు నమ్మవద్దు

తొలి మూడు రోజులు టోకెన్ ఉన్న భక్తులకే దర్శనం భక్తులను రావద్దని చెప్పే అధికారం ఎవ్వరికీ లేదు 2వ తేదీ నుంచి టోకెన్ లేని భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు (అమ‌రావ‌తి,న్యూస్ ఇన్‌) డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలపై సోషియల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు భక్తులకు విజ్ఞప్తి చేశారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు…

Read Full News

కేసీఆర్, వైఎస్ జగన్ భారీగా ఫ్లెక్సీలు

వైఎస్ జగన్, కేసీఆర్ సంక్షేమానికి చిరునామా రెండు రాష్ట్రాల్లో రాబోయేది సంక్షేమ పాలననే (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మాజీ సీఎం కేసీఆర్, భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లతో పాటు వైఎస్ జగన్ కలిసి ఉన్న కటౌట్ లు అమరావతి, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం, విజయవాడలో వెలిశాయి. సంక్షేమ ప్రధాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు…

Read Full News

న‌వ దంప‌తుల అనుమాన‌స్ప‌ద‌ మృతి

(హైద‌రాబాద్,న్యూస్ ఇన్‌) రెండె నెల‌ల క్రితం పెళ్లైన న‌వ దంపతులు అనుమాస్ప‌దంగా మృతి చెందిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది.యాదాద్రి భువనగిరి జిల్లా రైలు పట్టాల కింద పడి ఇద్దరు నవ దంపతుల మృతి చెందిన విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సింహాచలం, భవానీ గా గుర్తించారు. హైద‌రాబాద్ లో ఉంటున్న ఈ న‌వదంపతులు విజ‌య‌వాడ‌లోని త‌మ బంధుల ఇంటికి వెళ్లేందుకు మ‌చిలీప‌ట్నం రైలులో బ‌య‌లు దేరిన‌ట్లు తెలుస్తోంది.రైలులో ప్ర‌యాణిస్తూ డోర్ ద‌గ్గ‌ర నిలుచుండ‌డంతో…

Read Full News
టీటీడి కీల‌క నిర్ణ‌యం…రాయితీపై పంచ‌లోహ విగ్ర‌హాలు

టీటీడి కీల‌క నిర్ణ‌యం…రాయితీపై పంచ‌లోహ విగ్ర‌హాలు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హిందూ దేవాలయాలకు రాయితీపై మైక్ సెట్, గొడుగులు, శేష వస్త్రం, రాతి మరియు పంచలోహ విగ్రహాలు ఇచ్చేందుకు నిర్ణ‌యించింది. సనాతన హిందూ ధర్మప్రచారంలో భాగంగా హిందువుల ఆలయాలకు మైక్ సెట్, గొడుగులు, శేషవస్త్రం, రాతి మరియు పంచలోహ విగ్రహాలను రాయితీపై అందిస్తుంది.నిబంధనలకు అనుగుణంగా డిడితో పాటు పూర్తి చేసిన దరఖాస్తులను కార్యనిర్వహణాధికారి, టిటిడి పరిపాలనా భవనం, కె.టి.రోడ్డు, తిరుపతి అనే చిరునామాకు పంపాలి. ఇతర వివరాలకు 0877-2264276…

Read Full News

శ్రీశైలం, హైద‌రాబాద్ లలో సీఇసీ ప‌ర్య‌ట‌న‌

(హైదరాబాద్, న్యూస్ఇన్‌) భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) గ్యానేశ్ కుమార్ అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్‌కు రానున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆయన మధ్యాహ్నం 12.00 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీశైలంలోని భ్ర‌మ‌రాంభ‌ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. మరుసటి రోజు తెల్లవారుజామున ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో మహా ఆరతి కార్యక్రమంలో పాల్గొని దర్శనం చేసుకుంటారు. శ్రీశైలంలో సీఈసీ పర్యటన పూర్తిగా భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం. హైదరాబాద్ షెడ్యూల్‌లో…

Read Full News
భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుప‌తిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్

భ‌క్తుల సౌక‌ర్యార్థం తిరుప‌తిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్

ముంబైలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం తిరుమ‌ల‌లోని ర‌హ‌దారుల‌కు శ్రీ‌వారి నామాలతో పేర్లు టీటీడీ ఛైర్మ‌న్ బిఆర్ నాయుడు (అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) తిరుమ‌ల తిరుప‌తి ధ‌ర్మ‌ల క‌ర్త‌ల మండ‌లి స‌మావేవం ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. మంగ‌ళ‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో చైర్మ‌న్ బీఆర్ నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాలు…. టిటిడి ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు ప‌ల‌మ‌నేరులో 100 ఎకరాలలో దివ్య వృక్షాలు పెంచేందుకు నిర్ణయం. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో…

Read Full News
అమ‌రావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహం

అమ‌రావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహం

స్టాచ్యూ ఆఫ్ శాక్రిఫైస్ స్మృతివనం పొట్టిశ్రీరాములు స్పూర్తితో తెలుగుజాతిని అగ్రపథాన నిలిపేలా సుపరిపాలన మూడు రాజధానుల పేరుతో గత పాలకుల మహా కుట్ర పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (అమ‌రావ‌తి, న్యూస్ఇన్) భావితరాలకు గుర్తుండిపోయేలా అమరజీవి పొట్టిశ్రీరాములు స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఆయన పోరాడిన 58 రోజులకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు…

Read Full News
ఆధ్యాత్మికత ద్వారా విశ్వ చైతన్యం: ఏపీ సీఎం చంద్రబాబు

ఆధ్యాత్మికత ద్వారా విశ్వ చైతన్యం: ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్ శివారులోని కన్హా శాంతివనంలో ముఖ్యమంత్రి పర్యటన దేశంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం హార్ట్ ఫుల్ ఇంటర్నెషనల్ స్కూల్ సందర్శించిన ముఖ్యమంత్రి (హైదరాబాద్ న్యూస్ఇన్) ఆధ్యాత్మికత ద్వారానే విశ్వ చైతన్యం సాధ్యమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం హైదరాబాద్ శివారులోని కన్హా శాంతి వన ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కన్హా శాంతి వనం నిర్వాహకులు, శ్రీరామ చంద్ర మిషన్ ప్రెసిడెంట్ దాజీతో సమావేశమయ్యారు. శాంతి వనంలో ప్రపంచంలోనే అతిపెద్ద…

Read Full News