Headlines
జూన్ 21న యోగాంధ్ర@2026

జూన్ 21న యోగాంధ్ర@2026

(అమరావతి,న్యూస్ఇన్) రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, ఘనంగా యోగాంధ్ర-2026 నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా డే నిర్వహణకు సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా యోగాంధ్ర 2026పై తలపెట్టిన కార్యక్రమాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. యోగాంధ్ర -2026 కార్యక్రమంలో భాగంగా జూన్ 7 నుంచి 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాజధాని అమరావతిలో 25 వేల మందితో నిర్వహించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో…

Read Full News
జూన్ 10 నుంచి శ్రీవాణి దర్శన టికెట్లలో మార్పులు

జూన్ 10 నుంచి శ్రీవాణి దర్శన టికెట్లలో మార్పులు

(తిరుమల,న్యూస్ఇన్ ) భక్తుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన దర్శన టికెట్ల కేటాయింపులో పలు మార్పులు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోజుకు 1500 శ్రీవాణి టికెట్లను టీటీడీ ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంచడం జరిగింది. వీటిలో 500 దర్శన టికెట్లను మూడు నెలల ముందుగా ఆన్ లైన్ లో అడ్వాన్స్ బుకింగ్ కింద అందుబాటులో ఉంచడం జరిగింది. మరో 200 శ్రీవాణి దర్శన టికెట్లను తిరుపతి విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కింద…

Read Full News
ఇందిరా గాంధీ,ఎన్టీఆర్ స్పూర్తి తోనే పాలన

ఇందిరా గాంధీ,ఎన్టీఆర్ స్పూర్తి తోనే పాలన

(హైదరాబాద్,న్యూస్ఇన్) ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, తెలుగుజాతి గర్వించదగిన నాయకుడు ఎన్ టీ రామారావుల స్ఫూర్తితో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. హైదరాబాద్ అమీర్‌పేట్, మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఎన్టీఆర్ సేవలను…

Read Full News
రాష్ట్రంలో ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్

రాష్ట్రంలో ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్

(హైదరాబాద్,న్యూస్ఇన్) రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డును (యూనిఫైడ్ కార్డ్ ) రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డ్ ద్వారా స్పష్టంగా తెలిసేలా ఉండాలని సూచించారు. తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్…

Read Full News
ప్రపంచానికే తలమానికంగా “ఫ్యూచర్ సిటీ”

ప్రపంచానికే తలమానికంగా “ఫ్యూచర్ సిటీ”

(హైదరాబాద్,న్యూస్ ఇన్) ప్రపంచానికే తలమానికంగా ఉండేలా “ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతోందని రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ రెడ్డి, డి .శ్రీధర్ బాబు తెలిపారు. “ఫ్యూచర్ సిటీ” ప్రాజెక్టు ప్రాంతంలో మంత్రులు పర్యటించి నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయ భవనం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.అనంతరం మంత్రులు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు…

Read Full News
మైహోమ్ రామేశ్వర రావు నుంచి శిఖం భూమికి విముక్తి …!

మైహోమ్ రామేశ్వర రావు నుంచి శిఖం భూమికి విముక్తి …!

(హైదరాబాద్,న్యూస్ఇన్) ప్రముఖ రియల్ ఎస్టేట్ మై హోమ్ చేరలో ఉన్న రూ.1800 కోట్ల విలువైన భూమిని హైడ్రా విముక్తి కల్పించింది.ఐటీ కారిడార్‌లోని మాధాపూర్‌లో చెరువును మాయం చేయాల‌నే క‌బ్జాద‌దారుల ప్ర‌య‌త్నాల‌ను హైడ్రా అడ్డుకుంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంప‌ల్లి మండ‌లం ఖానామెట్ విలేజ్ స‌ర్వే నంబ‌రు 7లో ఉన్న 6.05 ఎక‌రాల ఈదుల‌కుంటను క‌బ్జాల చెర నుంచి విడిపించింది. శిల్పారామం ఎదురుగా ఉన్న త‌మ్మిడికుంట నిండితే వ‌ర‌ద కాలువ ద్వారా ఈదుల కుంట‌కు నీరు చేరేది. ఆ కాలువ‌ను…

Read Full News
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీ.కే. శివకుమార్…!

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీ.కే. శివకుమార్…!

(బెంగుళూరు,న్యూస్ఇన్) కన్నడ రాజకీయాల్లో కొత్త శకం మొదలుకానుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రి పదవి వరించింది. సిద్దు ఇమేజ్… డీకే ప్రయత్నాలతో అధికారంలోకి కర్ణాటకలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇద్దరు నేతలకు సంబంధిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చింది. అందులో భాగంగా రెండున్నర ఏళ్ల పాటు ఒక్కొక్కరు సీఎం గా ఉండాలని పార్టీ హై కమాండ్ సిద్ది రామయ్యలు సీఎంగా ఎంపిక చేసినప్పుడే నిర్ణయం తీసుకుంది.సిద్దు రెండేళ్ల కాల పరిమితి పూర్తయిన…

Read Full News
రాష్ట్రంలో ప్రతి పౌరుడికి సమగ్ర సంక్షేమ కార్డ్

సమయం ఇవ్వండి-తమ్మిడిహట్టి పై చర్చిద్దాం…!

(హైదరాబాద్, న్యూస్ఇన్) తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌ ఎత్తు, నిర్మాణంపై మహారాష్ట్రతో చర్చించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ కు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందంతో సమావేశానికి సమయమివ్వాలని, అనుకూలమైన తేదీని త్వరగా ఖరారు చేయాలని ముఖ్యమంత్రి గారు లేఖలో కోరారు. డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్‌ నిర్మించాల్సి ఉంది….

Read Full News
RR Vs SRH : RR చేతిలో ముగిసిన హైదరాబాద్ ఐపీఎల్ సీజన్

RR Vs SRH : RR చేతిలో ముగిసిన హైదరాబాద్ ఐపీఎల్ సీజన్

(స్పోర్ట్స్ డెస్క్,న్యూస్ ఇన్) ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్ లో సన్ రైజర్స్హైదరాబాద్ వత్తిడి తో చిత్తయింది. రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఎంతో ఉత్కంఠ రేపినా… చివరికి ఏకపక్షంగా ముగిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్,సన్ రైజర్స్ ముందు 244 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. కీలక మ్యాచ్ లో ఓటమితో ఈ ఏడాది ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది.హైదరాబాద్ జట్టు పవర్ ప్లే వరకు పరవాలేదు అనిపించే…

Read Full News
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ-ట్రాఫిక్ మళ్లింపు

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ-ట్రాఫిక్ మళ్లింపు

(హైదరాబాద్,న్యూస్ఇన్) అమీర్‌పేట్‌లోని మైత్రివనం జంక్షన్ మరియు దాని పరిసర ప్రాంతాలలో గురువారం విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్భంగా  రాకపోకలు,బహిరంగ సభను పురస్కరించుకుని ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయాలని ట్రాఫిక్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ మళ్లింపు పూర్తి వివరాలు… 27.05.2026 తేదీ రాత్రి 22:00 గంటల నుండి 28.05.2026 తేదీ రాత్రి 23:00 గంటల వరకు• అమీర్‌పేట్, సత్యం థియేటర్ మరియు ఎస్.ఆర్. నగర్ నుండి వచ్చే వాహనాలు:సారథి స్టూడియో నుండి యూసుఫ్‌గూడ బస్తీ మరియు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు…

Read Full News