Headlines
నగరంలోని లాడ్జిలపై సిపి సజ్జనార్ తనిఖీ

నగరంలోని లాడ్జిలపై సిపి సజ్జనార్ తనిఖీ

(హైదరాబాద్,న్యూస్ఇన్) నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు హోటళ్లు, ఓయో హోటళ్లు, లాడ్జీలతో పాటు రోడ్ల పై కూడా తనిఖీలు చేపట్టారు. స్వయంగా పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ అమీర్‌పేట్‌, ఎస్‌ఆర్‌నగర్‌ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. హోటళ్లలో బస చేస్తున్న అతిథుల ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలు, గెస్ట్ రిజిస్టర్లు, చెక్-ఇన్ రికార్డులు, సీసీటీవీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లు మరియు అవసరమైన అనుమతి పత్రాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఏదైనా…

Read Full News
స్పా సెంటర్లపై పోలీసుల ఉక్కుపాదం…!

స్పా సెంటర్లపై పోలీసుల ఉక్కుపాదం…!

(హైదరాబాద్,న్యూస్ ఇన్) అక్రమ కార్యకలాపాలు, అనధికారిక క్రాస్ మసాజ్ సేవలు, భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై మల్కాజిగిరి కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (SOT) సహకారంతో కమిషనరేట్ పరిధిలోని స్పా సెంటర్లపై విస్తృత స్థాయిలో తనిఖీలు, దాడులు నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీల్లో మొత్తం 113 స్పా సెంటర్లను పరిశీలించగా, నిబంధనలను ఉల్లంఘించిన 46 స్పా సెంటర్ల యజమానులు, నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ప్రజా భద్రతా నోటిఫికేషన్లు, చట్టపరమైన నిబంధనలు,…

Read Full News
తిరుమలలో 1.21 కోట్ల లడ్డూల విక్రయం

తిరుమలలో 1.21 కోట్ల లడ్డూల విక్రయం

(తిరుమల,న్యూస్ఇన్) కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ ఏడాది మే నెలలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచి, ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందిస్తోంది.ఈ ఏడాది మే నెలలో మొత్తం 1,21,35,528 లడ్డూలు విక్రయమయ్యాయి. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది లడ్డూల విక్రయాలు గణనీయంగా పెరిగాయి.2024…

Read Full News
బీఆర్ఎస్ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే….!

బీఆర్ఎస్ గూటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే….!

(హైద‌రాబాద్, న్యూస్ఇన్‌) అవును….మీరు చ‌దివింది నిజ‌మే… బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే సొంత కోటికి చేరుకునేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఈ వ్యవహారం మ‌రోసారి రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ హాట్ గా మారుతోంది. కాంగ్రెస్ పార్టీతో ఏమాత్రం సంబంధం లేకుండానే కాంగ్రెస్ పార్టీకి చేరువైన ఆ ఎమ్మెల్యే సొంత గూటికి చేరుకునే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్న‌ట్లు ,చ‌ర్చ జ‌రుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ తో ఇందుకు సంబంధించిన…

Read Full News
థాయ్‌లాండ్ టు హైద‌రాబాద్ గంజాయి….!

థాయ్‌లాండ్ టు హైద‌రాబాద్ గంజాయి….!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) తెలంగాణ ఈగిల్ ఫోర్స్ అంతర్జాతీయ హైడ్రోపోనిక్ గంజాయి స్మగ్లింగ్ ముఠాను ఛేదించింది. థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు అధిక THC శాతం కలిగిన ప్రీమియం హైడ్రోపోనిక్ గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న ముఠా కార్యకలాపాలను వెలికితీసింది. ఈ ముఠా గతంలో అరుదైన వస్తువుల స్మగ్లింగ్‌లో పాల్గొనగా, 2023 నుంచి మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై దృష్టి సారించినట్లు దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 8న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడు సోధా…

Read Full News
లోక్ భవన్లో భావోద్వేగ సన్నివేశం

లోక్ భవన్లో భావోద్వేగ సన్నివేశం

(హైదరాబాద్, న్యూస్ఇన్) లోక్ భవన్‌లోని సంస్కృతి కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరుగుతున్న వేళ, అక్కడ చోటుచేసుకున్న ఓ హృద్యమైన ఘటన అందరినీ ఆకట్టుకుంది.ఓ దివ్యాంగురాలి అభిమానానికి, ఆత్మవిశ్వాసానికి, ప్రతిభకు ప్రతీకగా నిలిచిన క్షణం.జీహెచ్‌ఎంసీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వైష్ణవి చిన్ననాటి నుంచే జీవిత సవాళ్లతో పోరాడుతోంది. అయితే శారీరక వైకల్యాన్ని ఆమె ఎన్నడూ తన కలలకు అడ్డంకిగా భావించలేదు. తన కాళ్లనే చేతులుగా మార్చుకుని చిత్రకళలో అసాధారణ నైపుణ్యాన్ని సాధించి, ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.రాష్ట్ర గవర్నర్ శ్రీ…

Read Full News
2029 ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ…!

2029 ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ…!

(హైదరాబాద్,న్యూస్ఇన్) వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని జనసేన అధినేత ప్రకటించారు.తెలంగాణ రాజకీయాల్లో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రియాశీలం కానున్నారు. తెలంగాణ ఎవరి అయ్యా జాగీర్ కాదని, ఇక్కడే తన రాజకీయ జీవితం మొదలైన విషయాన్ని ప్రజలు గుర్తించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.ప్రస్తుతానికి రాజకీయాల కంటే ముందు ప్రజా సమస్యలపై పోరాడాలని, ప్రజలకు అండగా నిలబడాలని తన పార్టీ కార్యకర్తలకు సూచించినట్లు ఆయన తెలిపారు. ఇక తాను ఓ…

Read Full News
జనసేన యత్నాలు విఫలం-పవన్ ప్రెస్ మీట్

జనసేన యత్నాలు విఫలం-పవన్ ప్రెస్ మీట్

(హైదరాబాద్, న్యూస్ఇన్) హైదరాబాదులో బహిరంగ సభ ఏర్పాటు చేసేందుకు పోలీసులు నిరాకరించడంతో జనసేన పార్టీ వేసిన హౌజ్ మోషన్ పిటిషన్‌ను తో హైకోర్టును ఆశ్రయించింది.హైకోర్టు అనుమతితో హైదరాబాదులో సభ నిర్వహించాలన్న ప్రయత్నాలు చేసింది ఇది కూడా సఫలం కాలేదు.జనసేన పార్టీ వేసిన హౌస్ మోషన్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభ నిర్వహణకు అనుమతి ఇవ్వని పోలీసుల వ్యవహార శైలిని రాజకీయంగా తప్పుపడుతున్నారు. హైకోర్టులో కూడా జనసేన అధినేతకు సానుకూలంగా…

Read Full News
ఉద్యమ స్పూర్తి-త్యాగాల ఫలితమే తెలంగాణ: సీఎం

ఉద్యమ స్పూర్తి-త్యాగాల ఫలితమే తెలంగాణ: సీఎం

(హైదరాబాద్, న్యూస్ఇన్) తెలంగాణ ఉద్యమ స్పూర్తి, అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సాధ్యం అయిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమరవీరుల స్థూపం దగ్గర సీఎం నివాళులు అర్పించారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభసందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను సాకారం చేసుకుని తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పరేడ్…

Read Full News
4 న అఖిలపక్ష సమావేశం

4 న అఖిలపక్ష సమావేశం

(హైదరాబాద్, న్యూస్ఇన్) ఈనెల 4వ తేదీన అన్ని పార్టీల ప్రతినిధులతో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది.ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ డా.బీ.ఆర్.అంబెడ్కర్ రాష్ట్ర సచివాలయంలో 6వ అంతస్తులోని రూమ్ నెంబర్ 33 లో 4 వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరై తమ విలువైన సలహాలు, అభిప్రాయలు తెలిపేందుకు ఒక్కో పార్టీ నుండి ఇద్దరు ప్రతినిధులను నామినేట్ చేయాలని…

Read Full News