Headlines

ఏపీ, తెలంగాణా పార్ల‌మెంట్ సీట్ల‌పై క్లారిటీ

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విబ‌జ‌న‌లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. ఏపీలో లోక్‌సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయని, తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతాయని వెల్ల‌డించారు. తమిళనాడు, కర్ణాటకలోనూ సీట్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు. విపక్షాలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని విమర్శించారు.

Read Full News
నంద్యాల‌లో 45 డిగ్రీలు దాటిన ఊష్ణోగ్ర‌త‌

నంద్యాల‌లో 45 డిగ్రీలు దాటిన ఊష్ణోగ్ర‌త‌

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) రాష్ట్రంలో క్రమేపి పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. గురువారం గరిష్ఠంగా నంద్యాల జిల్లా సంజామలలో 45.1డిగ్రీలు నమోదైందని తెలిపారు. 215 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు. శుక్రవారం (17-04-26) మన్యం, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు,రాయలసీమ జిల్లాల్లో గరిష్ఠంగా 43-44.5°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు….

Read Full News
అవకాశం – అదృష్టంగా భావిస్తున్నా- లోకేష్

అవకాశం – అదృష్టంగా భావిస్తున్నా- లోకేష్

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) తెలుగుదేశం పార్టీ అధిష్టానం నాకు ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నా… పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కష్టపడతా, శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపికైన నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ… నాకు ఈ అవకాశం రావడానికి కారణమైన కార్యకర్తలందరికీ పేరుపేరునా కృతజ్జతలు… నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపికైన…

Read Full News
ఆకలి తీరితేనే నిజమైన అభివృద్ధి-చంద్ర‌బాబు

ఆకలి తీరితేనే నిజమైన అభివృద్ధి-చంద్ర‌బాబు

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) పేదల ఆకలి తీరిస్తేనే అభివృద్ధి సాధించినట్టు విశ్వసిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎంత అభివృద్ధి సాధించినా పేదలకు పట్టెడన్నం లేకపోతే అది వృధా అని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రవ్యాప్తంగా అన్నార్తుల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసినట్టు వివరించారు. పలనాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం, ధరణికోటలో కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ధరణికోటలో ఏర్పాటు చేసిన రూరల్ అన్న క్యాంటీన్ ప్రారంభించిన అనంతరం రూ.5 వెచ్చించి…

Read Full News
ఏపీలోనూ ఎండ‌ల తీవ్ర‌త‌ – ఒంటిమిట్ట లో అత్య‌దికం

ఏపీలోనూ ఎండ‌ల తీవ్ర‌త‌ – ఒంటిమిట్ట లో అత్య‌దికం

(అమ‌రావ‌తి, న్యూస్ఇన్‌) రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎండ తీవ్రత మరింత ప్రభావం చూపుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చ‌రించారు. మంగళవారం కడప జిల్లా ఒంటిమిట్టలో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని, అలాగే 262 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు. బుధవారం రాయలసీమ,కోస్తా జిల్లాల్లో 42-44°C మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం 4, విజయనగరం 19, పార్వతీపురంమన్యం…

Read Full News
క్వాంటం టెక్నాలజీకి ఏపీ లాంచ్ పాడ్

క్వాంటం టెక్నాలజీకి ఏపీ లాంచ్ పాడ్

(అమరావతి, న్యూస్ఇన్‌) ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో ఓ సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభమైంది. దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ ఆవిష్కృతమైంది. అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, గన్నవరంలోని మేధా టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన 1 ఎస్, 1 క్యూ క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. క్వాంటం టెక్నాలజీకి అమరావతిని లాంచ్ పాడ్‌గా మారుస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీలను ప్రారంభించిన…

Read Full News
ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాల్లో అన్ని వ‌స‌తులు ఉండాలి

ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాల్లో అన్ని వ‌స‌తులు ఉండాలి

(అమరావతి, న్యూస్ఇన్‌) పాఠశాలలు పునః ప్రారంభం నాటికి ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లన్నీ పూర్తి వసతులతో సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతీ హాస్టల్ గాడిలో పడాలని… అన్ని రకాల వసతులు ఉండాలని స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కనుంచి క్షేత్రస్థాయిలో వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”జూన్ లో స్కూళ్ల రీ-ఓపెనింగ్ నాటికి హాస్టళ్లు అన్నీ చక్కగా ఉండాలి. విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండాలి. టాయిలెట్లు.. ఆర్వో…

Read Full News

ఏపీ సీఎంతో GRMB చైర్మన్ దోర్జే గ్యాంబా భేటీ

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ చైర్మన్ పి దోర్జే గ్యాంబా సీఎం క్యాంపు కార్యాలయంలో ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేపట్టిన జల సంరక్షణ, సమర్ధ నీటి నిర్వహణ చర్యలు గురించి దోర్జే గ్యాంబాకు ముఖ్యమంత్రి వివరించారు. రాష్ట్రంలోని నదీపరివాహక ప్రాంతాల్లో అవేర్ సంస్థ ద్వారా జల వనరుల వివరాలు రియల్ టైమ్‌లో నమోదు చేస్తున్నట్టు తెలిపారు. వరద జలాలను సద్వినియోగం చేసుకుంటున్న తీరును, నదుల అనుసంధానంపై…

Read Full News
కేంద్రం కోర్టులోకి అమ‌రావ‌తి  బంతి

కేంద్రం కోర్టులోకి అమ‌రావ‌తి బంతి

(అమ‌రావ‌తి,న్యూస్ఇన్‌) ఏపీ రాజ‌ధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసేందుకు ప్రుభుత్వం ఏపీ శాస‌న‌స‌భ ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించింది. సభలో విభజన చట్టంలో సవరణ చేయాలని తీర్మానం చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి లోకేశ్‌తో పాటు ఈ తీర్మానంపై ప్ర‌సంగించారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 5లోని సబ్‌సెక్షన్‌ 2లో ‘ఎట్‌ అమరావతి ’ అన్న పదాన్ని చేర్చాలని ఏపీ శాస‌న‌స‌భ తీర్మానం చేసంది.. రాజధానిగా అమరావతి పేరుని గతంలో…

Read Full News
దక్షిణమధ్య రైల్వే స‌రుకు ర‌వాణాలో రికార్డు..!

దక్షిణమధ్య రైల్వే స‌రుకు ర‌వాణాలో రికార్డు..!

(హైద‌రాబాద్,న్యూస్ఇన్‌) దక్షిణ మధ్య రైల్వే ఈ ఆర్థిక సంవత్సరం 2025–26లో 144.244 మిలియన్ టన్నుల (ఎమ్.టిలు) సరుకు రవాణా చేసి రికార్డు సృష్టించింది. ఇది సరుకు రవాణా విభాగంలో కొత్త రికార్డుగా నిలువ‌నుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో నమోదైన అత్యుత్తమ లోడింగ్ అయిన 144.14 మిలియన్ టన్నులను ఈ ఆర్ధిక సంవ‌త్స‌రం అధిగమించింది. సింగరేణి బొగ్గు గనులు, సిమెంట్ కర్మాగారాల నుండి బొగ్గు, సిమెంట్ రవాణా రంగంలో కీల‌క పాత్ర పోషించింది. సాంప్రదాయ సరుకులతో పాటు ఇతర…

Read Full News