సర్ ‘గో’ బ్యాక్ తో దేశం ఏకమవుతుంది: సీఎం రేవంత్ రెడ్డి
(న్యూస్ఇన్,న్యూఢిల్లీ) రాబోయే రోజుల్లో ‘సర్ గో బ్యాక్’ నినాదంతో దేశం ఏకమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో అస్సాం దినపత్రిక ‘ప్రతిదిన్’ నిర్వహించిన కాంక్లేవ్‌లో ‘ఇండియాస్ నెక్ట్స్ చాప్టర్’ అంశంపై ఆయన మాట్లాడారు. ఎన్నికల విధానం, ఎస్‌ఐఆర్, డీలిమిటేషన్‌తో పాటు తెలంగాణ అభివృద్ధి, విద్య, నైపుణ్యాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.సైమన్ కమిషన్‌ను వ్యతిరేకిస్తూ గతంలో దేశవ్యాప్తంగా ఉద్యమం జరిగిందని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల సంఘాన్ని సైమన్ కమిషన్ తరహాలో ఉపయోగించుకునే…