మండుతున్న ఎండలు-పిట్టల్లా రాలుతున్న జనం
(హైదరాబాద్,న్యూస్ఇన్) తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఊష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. మండుతున్నఎండలు, వడగాలులతో జనం రాలుతున్నారు. ఏపీలో 48 డిగ్రీలకు పైగా ఊష్ణోగ్రతలు నమోదు కాగా తెలంగాణాలో దాదాపు 47 డిగ్రీల వరకు ఊష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. సోమవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు మరింత పెరిగే అవకాశం ఉంది. రోహిణీ కార్తె మొదలు కానున్న నేపథ్యంలో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. గత నాలుగైదు రోజుల్లోనే తెలంగాణాలో వడగాలులు, ఎండ వేడిమితో వంద మందికి పైగా మృతి…