ఆయిల్‌ఫెడ్ భూములపై హరీశ్ రావు ఆగ్రహం.. రేవంత్ సర్కార్‌కు బహిరంగ లేఖ

ఆయిల్‌ఫెడ్ భూములపై హరీశ్ రావు ఆగ్రహం.. రేవంత్ సర్కార్‌కు బహిరంగ లేఖ

(న్యూస్ఇన్, హైదరాబాద్) హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న విలువైన ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు ఆరోపించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అజామాబాద్‌లో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఆధీనంలో ఉన్న సుమారు 3 ఎకరాల 23 గుంటల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించే ప్ర‌య‌త్నాల‌ను త‌ప్పుబ‌ట్టారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. అజామాబాద్‌లోని ఆయిల్‌ఫెడ్ భూమి బహిరంగ మార్కెట్‌లో…

Read Full News
సెప్టెంబర్ 2న పిఠాపురంలో జనసేన యువజన విభాగం ఆవిష్కరణ

సెప్టెంబర్ 2న పిఠాపురంలో జనసేన యువజన విభాగం ఆవిష్కరణ

(న్యూస్ఇన్‌, అమ‌రావ‌తి) జనసేన పార్టీ యువజన విభాగాన్ని సెప్టెంబర్ 2వ తేదీన పిఠాపురంలో అధికారికంగా ఆవిష్కరించనున్నారు. పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 2న ఉదయం 11 గంటలకు యువజన విభాగం ఆవిష్కరణ కార్యక్రమాన్ని జనసైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకుల సమక్షంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర…

Read Full News
మార్పు రావాలి – మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రుగాలి

మార్పు రావాలి – మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రుగాలి

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) మ‌రోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్ర‌భుత్వంలో మార్పు రావాలని, మంత్రి వ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ జ‌రుగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వ తీరుపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంద‌న్న విష‌యాన్ని ఆయ‌న ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. ఏ రాజ‌కీయ పార్టీలో కూడా క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీలో గ్రూపు త‌గాదాలు త‌గ్గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ ముఖ్య‌మని, వీట‌న్నింటినీ సీఎం రేవంత్ రెడ్డి అదుపులో ఉంచ‌గ‌లిగితే మ‌రోసారి పార్టీ అధికారంలోకి…

Read Full News
ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ కు అధికారుల షాక్….!

ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ కు అధికారుల షాక్….!

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ కు అధికారులు షాక్ ఇచ్చారు. ప్ర‌భుత్వం ఎంతో ప్రతిష్టాత్మ‌కంగా న‌గ‌రంలో నిర్మాణం చేయాల‌ని భావిస్తున్న ఇందిర‌మ్మ ట‌వ‌ర్స్ ల‌బ్ది దారుల ఎంపిక సంద‌ర్భంగా అధికారులు వ్య‌వ‌హ‌రించిన తీరు ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. అధికారుల తీరుపై ఎమ్మెల్యే దానం తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌రంలో ల‌క్ష ఇళ్ల నిర్మాణం చేస్తామ‌ని ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం పైలెట్ ప్రాజెక్టులో భాగంగా తొలి విడ‌త‌లో దాదాపు 8 వేల…

Read Full News
రాఖీ పౌర్ణమి సందర్భంగా 5 వేల‌ ప్రత్యేక బస్సులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా 5 వేల‌ ప్రత్యేక బస్సులు

(న్యూస్ఇన్‌,హైదరాబాద్) రాఖీ పౌర్ణమి సందర్భంగా 5 వేల ప్ర‌త్యేక బ‌స్సులు ఏర్పాటు చేస్తున్న‌ట్లు ఆర్టీసి ప్ర‌క‌టించింది. పండ‌గ‌ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 27వ తేదీ నుంచి 31 వరకు ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.గత ఏడాది రాఖీ పౌర్ణమి సందర్భంగా 4,760 ప్రత్యేక బస్సులను నడిపించగా, ఈ ఏడాది ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 240 బస్సులను అదనంగా పెంచి మొత్తం 5,000…

Read Full News
మీర్ఆలం చెరువుకు కొత్త హంగులు – సీఎం అక‌స్మిక ప‌రిశీల‌న‌

మీర్ఆలం చెరువుకు కొత్త హంగులు – సీఎం అక‌స్మిక ప‌రిశీల‌న‌

(న్యూస్ఇన్‌,హైదరాబాద్) మీర్ ఆలం చెరువుకు ప్రభుత్వం సరి కొత్త హంగులు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. దీనిని ప్రముఖ పర్యాటక, వినోద కేంద్రంగా అభివృద్ధి చేసేలా చ‌ర్య‌లు చేప‌డుతోంది. మీర్ఆలం చెరువును ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం అకస్మికంగా పరిశీలించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షించారు. చెరువు చుట్టూ జరుగుతున్న పనులు,చెరువుపై నిర్మిస్తున్న ఐకానిక్ సస్పెన్షన్ బ్రిడ్జి పనులను సీఎం పరిశీలించారు. అధికారులు ఫొటో ప్రదర్శన ద్వారా పనుల పురోగతిని సీఎంకు వివరించారు. నిర్ణీత గడువులోగా…

Read Full News
ఇందిరమ్మ టవర్స్ లాట‌రీ ఆగస్టు 28 నుంచి 31 వరకు

ఇందిరమ్మ టవర్స్ లాట‌రీ ఆగస్టు 28 నుంచి 31 వరకు

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్) ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ పథకంలో ఇండ్ల కేటాయింపు లాటరీ ప్రక్రియ ఈ నెల 28 నుంచి 31 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతి రోజూ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు చొప్పున 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగు రోజుల పాటు ఈ ప్రక్రియను పూర్తి చేయ‌నున్న‌ట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ విపి గౌతం తెలిపారు. ఈ లాటరీ ప్రక్రియనంతటినీ యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని, ఎటువంటి అనుమానాలు, అపోహలకు తావివ్వకుండా పూర్తి…

Read Full News
మోడీ పాకిస్తాన్ వెళ్ల‌డంపై బీజేపీ నేత‌లు ఏమంటారు

మోడీ పాకిస్తాన్ వెళ్ల‌డంపై బీజేపీ నేత‌లు ఏమంటారు

(న్యూస్ఇన్‌,హైద‌రాబాద్) ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఎలాంటి ముందుస్తు స‌మాచారం లేకుండా అప్పట్టి పాకిస్తాన్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్ ను క‌లిసేందుకు ఎలా వెళ్లారో బీజేపీ నేత‌లు చెప్పాల‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌ను కేంద్ర ప్ర‌భుత్వం కుట్ర‌తో అడ్డుకుంద‌న్నారు. తెలంగాణా లో పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా ముఖ్య‌మంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఆమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళుతుంటే కేంద్రం అది విజ‌య‌వంతం అవుతుంద‌న్న కుట్ర‌తో అడ్డుకుంద‌ని జ‌గ్గారెడ్డి వ్యాఖ్యానించారు.ఇది కేవ‌లం…

Read Full News
లండన్‌లో అంబేద్క‌ర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

లండన్‌లో అంబేద్క‌ర్ హౌస్‌ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్‌) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి లండన్‌లోని ప్రసిద్ధ అంబేడ్కర్ హౌస్‌ను సందర్శించారు.బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ 1921-22లో లండన్‌లోని ప్రిమ్‌రోజ్ ప్రాంతంలోని 10 కింగ్ హెన్రీ’స్ రోడ్‌లో నివసించిన ఇంటిని సీఎం సందర్శించారు. మహనీయులు డాక్టర్ అంబేడ్కర్ గారి హౌస్‌ను సందర్శించడం ఒక ఆధ్యాత్మిక క్షేత్రాన్ని సందర్శించడం లాంటిది. ఇది జీవితకాలపు స్ఫూర్తినిస్తుంది. సామాజిక న్యాయం కోసం అంకితభావంతో పనిచేయాలన్న నా ఆకాంక్ష మరింత పెరిగిందని సీఎం రేవంత్…

Read Full News
మంత్రి కొండా సురేఖ వ్య‌వ‌హారం-ఎంపీ వేం నరేందర్ రెడ్డికి సంకటం

మంత్రి కొండా సురేఖ వ్య‌వ‌హారం-ఎంపీ వేం నరేందర్ రెడ్డికి సంకటం

(న్యూస్ఇన్‌, హైద‌రాబాద్) మంత్రి కొండా సురేఖ వ్య‌వ‌హారం ఎంపీ వేం న‌రేంద‌ర్ రెడ్డికి రాజ‌కీయ‌ సంక‌టంగా మారింది. ఈ వ్య‌వ‌హారంలో కొండా సురేఖ‌పై వ‌త్తిడి రాజ‌కీయంగా వ‌త్తిడి పెంచేలా చ‌క్రం తిప్పాల‌ని సీఎం ప‌ట్టు ద‌ల‌తో ఉండ‌డంతో సీఎం కు అత్యంత స‌న్నిహితంగా ఉండే వేం న‌రేంద‌ర్ రెడ్డికి బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు తెలుస్తోంది.ఏక ప‌క్ష నిర్ణ‌యాల‌కు వెళ్ల‌కుండా పార్టీ అంత‌ర్గ‌తంగా ఉన్న ప‌రిస్థితుల‌ను ముందుగా తెర‌పైకి తెచ్చి ఆ త‌రువాత కొండా సురేఖ‌పై నిర్ణ‌యానికి రావాల‌ని సీఎం…

Read Full News