కోడంగల్‌లో రాజకీయ వేడి.. సీఎం పర్యటన వేళ మాజీ ఎమ్మెల్యే నిరసన
(న్యూస్ఇన్, పాలమూరు) ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో అభివృద్ధి పనుల పరిశీలనకు పర్యటిస్తున్న వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఒకవైపు సీఎం నియోజకవర్గంలో పలు అభివృద్ధి, పనుల పురోగతిని సమీక్షిస్తుండగా.. మరోవైపు బీఆర్‌ఎస్‌కు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి నిరసన కార్యక్రమం చేపట్టేందుకు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్‌రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా కోడంగల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్నారు. విద్యా సంస్థలు, ఆస్పత్రులు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులతో…