పెన్షన్ల కోసం విడిపోవద్దు.. కుటుంబమే సంక్షేమ యూనిట్: చంద్రబాబు
(న్యూస్ఇన్, అమరావతి) సంక్షేమ పథకాల కోసం కుటుంబాలు చిన్న కుటుంబాలుగా విడిపోవాల్సిన పరిస్థితి లేకుండా భవిష్యత్తులో అన్ని పథకాలను ‘ఫ్యామిలీ యూనిట్’గా అమలు చేసే విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కొత్త పెన్షన్లు మంజూరు చేసేలోపే కుటుంబాల మ్యాపింగ్ పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులను యథాతథంగా కొనసాగించాలన్నారు.రేషన్ విషయంలో కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు….