రూ. 600ల కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
(హైదరాబాద్, న్యూస్ఇన్) బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబరు 13లో బంజారా లేక్‌ను ఆనుకుని ఉన్న 3.63 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 600ల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. నిజాం కాలంలో జూబ్లీహిల్స్ మున్సిపాలిటీ లే ఔట్‌లో అన్ రికగ్నైజ్డ్ ప్లాట్‌గా మిగిలిన ఈ భూమి కోర్టు వివాదంలో ఉంది. ఈ భూమిని ఆక్రమించుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారని.. దీనిని కాపాడి పార్కుగా అభివృద్ధి చేయాలని బంజారాహిల్స్ లేక్ పరిరక్షణ సమితితో పాటు.. స్థానికులు…