ఉద్యోగుల భద్రత-బాధ్యత ప్రభుత్వానిదే సీఎం
(న్యూస్ఇన్, హైదరాబాద్) “సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ.. ఏదైనా అందరికీ ప్రభుత్వమే యజమాని. ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా భద్రత కలిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అడగకపోయినా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని సీఎం వ్యాఖ్యానించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం బీమా సౌకర్యం కల్పించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు పాల్గొన్నారు….