బకాయి మిల్లర్లపై తెలంగాణ సివిల్ సప్లైస్ ఉక్కుపాదం.. 28 మంది కమాండోలతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్
(న్యూస్ ఇన్, హైదరాబాద్) ప్రభుత్వానికి బియ్యం బకాయిలు చెల్లించకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్న మిల్లర్లపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. సివిల్ సప్లైస్ శాఖ ఎన్ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ విభాగంలో గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌కు చెందిన 28 మంది కమాండోలను నియమించింది. బకాయి ఉన్న రైస్ మిల్లులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అక్రమాలను గుర్తించేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలుగా వీరు పనిచేయనున్నారు. మిల్లర్లపై ప్రత్యేక నిఘా సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ శుక్రవారం…