వైఎస్ చివరి కోరిక నెరవేర్చడమే నిజమైన నివాళి: సీఎం రేవంత్ రెడ్డి
(న్యూఢిల్లీ, న్యూస్ఇన్) దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో జరిగిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయని రేవంత్ రెడ్డి అన్నారు. తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విద్య, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారని, ఆయన దూరదృష్టితో దేశం ఆహార కొరత నుంచి ఆహార…