బండి భగీరథ్ తప్పుచేస్తే శిక్ష అనుభవించాల్సిందే
(హైదరాబాద్,న్యూస్ఇన్) ‘‘ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు. నిజానిజాలు కోర్టులు తేలుస్తాయి. తప్పు చేసినట్లు తేలితే శిక్ష అనుభవించాల్సిందే. చట్టం ముందు అందరూ సమానమే. కోర్టు నిర్ణయమే నాకు శిరోధార్యం. చట్టానికి కట్టుబడి ఉన్నా* అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘‘సమాజమే నా కుటుంబమని భావించి జీవితమంతా సమాజం కోసమే పనిచేసిన. ఏ ఇంట్లో కష్టమొచ్చినా పెద్ద కొడుకునై అండగా ఉన్నా. కానీ కొడుకుకు టైమివ్వలేకపోయా. జరుగుతున్న పరిణామాలకు తప్పు…